అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా (37 ఏళ్లు) 2025, ఆగస్టు 24న ప్రకటించాడు.
అతడు దశాబ్ద కాలానికి పైగా మూడో స్థానంలో భారత్‌కు నమ్మదగ్గ బ్యాటర్‌గా ఉన్నాడు.
పుజారా.. తన కెరీర్‌లో 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు చేశాడు.
అతడు 5 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు.
చివరిసారి అతడు 2023 జూన్‌లో టెస్టు మ్యాచ్ ఆడాడు.
పుజారా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
103 టెస్టుల్లో 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.
టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
అతడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21301 పరుగులు చేశాడు.