బుద్ధిమాంద్యం (ఆటిజం) గురించి ప్రపంచంలో అవగాహన పెంచడానికి 15 ఏళ్ల నైజీరియన్ బాలుడు కాన్యెయాచుక్వు టాగ్బో 12,304 చదరపు మీటర్ల కాన్వాస్‌పై చిత్రపటాన్ని రచించి గిన్నిస్ రికార్డు సాధించాడు. దీనికి ముందు రికార్డు 42 ఏళ్ల ఎమాద్ సలేహీ పేరు మీద ఉండేది. సలేహీ 9,652 చదరపు మీటర్ల కాన్వాస్‌పై చిత్రాన్ని రచించగా, ఆ రికార్డును కాన్యెయాచుక్వు బద్దలుకొట్టాడు. 2024 నవంబరులో అతడు గీసిన చిత్ర విస్తీర్ణం ఒక ఫుట్ బాల్ మైదానంకన్నా పెద్దది. నైజీరియా రాజధాని అబుజాలోని ఈగిల్ చౌక్‌లో అతడు చిత్ర రచన చేశాడు. ఆటిజం చిహ్నమైన రంగుల రిబ్బను లూప్ ఆకృతిని కాన్యెయాచుక్వు గీశాడు.