Published on Dec 23, 2024
Government Jobs
చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు
చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు

చిత్తూరులోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం చిత్తూరులోని జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది మెడికల్‌, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16.

వివరాలు:

1. ల్యాబ్- టెక్నీషియన్ గ్రేడ్‌-II: 3 పోస్టులు

2. ఫీమేల్‌ నర్సింగ్ ఆర్డర్లీ: 7 పోస్టులు

3. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 6 పోస్టులు

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ).

గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు ల్యాబ్-టెక్నీషియన్ పోస్టులకు రూ.32,670. ఇతర పోస్టులకు రూ.15,000.

ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27-12-2024.

Website:https://chittoor.ap.gov.in/