Published on Mar 6, 2025
Current Affairs
చండీగఢ్‌
చండీగఢ్‌

2024లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు కొత్త చట్టాలను మొదట కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

అందులో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ) ఉన్నాయి.

ఇందుకోసం అధికారులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించింది. దీంతో చండీగఢ్‌ పోలీసులు కొత్త చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 

ఇప్పటివరకూ వారు 1,179 కేసులను నమోదు చేశారు. 245 కేసుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. నాలుగు కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి.

అంటే 2024 జులైలో ప్రారంభించిన కొత్త చట్టాల అమలు తర్వాత నాలుగైదు నెలల్లోనే శిక్షలు పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు.

కొత్త చట్టాలు డిజిటల్‌ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. ఇందుకోసం ఎన్‌సీఆర్‌బీ, ఎన్‌ఐసీలు పలు యాప్‌లను అభివృద్ధి చేశాయి.