Published on Aug 20, 2025
Current Affairs
‘చెట్ల పనితీరుపై స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావం’
‘చెట్ల పనితీరుపై స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావం’

భూమిపై పెరుగుతున్న ఉష్ణ తాపాన్ని నిలువరించడానికి ఉత్తర, దక్షిణ ధ్రువాల వైపు కంటే భూ మధ్య రేఖ పరిధిలోని ఉష్ణమండల ప్రాంతాల్లో చెట్లను నాటడం ఎక్కువ ఫలితాలను ఇస్తుందని ఓ అధ్యయనం తేల్చింది. ‘చెట్ల పనితీరుపై స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావం’ అనే అంశంపై అమెరికాలోని కాలిఫోర్నియా రివర్‌సైడ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనం నిర్వహించింది. ఆ వివరాల ప్రకారం.. చెట్లను ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో నాటితే అవి అక్కడ స్వల్ప ఉష్ణోగ్రత పెరిగేందుకు కారణమవుతున్నాయని.. తేమ ఎక్కువుండే భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తేలింది.