Published on Oct 24, 2024
Government Jobs
గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ పోస్టులు
గోవా ఐఐటీలో నాన్‌ టీచింగ్ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ గోవా నాన్‌ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివ‌రాలు:

1. స్టూడెంట్ కౌన్సెలర్: 01

2. మెడికల్ ఆఫీసర్: 01

3. స్పోర్ట్స్‌ సూపరింటెండెంట్: 01

4. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 01

5. టెక్నికల్ సూపరింటెండెంట్ (ఎలక్ట్రికల్): 01

6. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 04

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో  డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్,  ఎంబీబీఎస్‌/ ఎండీ/ఎంఎస్,  పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (గ్రూపు-సి) పోస్టులకు 27 ఏళ్లు; మెడికల్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సెలర్ (గ్రూపు-ఎ) పోస్టులకు 42 ఏళ్లు; మిగతా (గ్రూపు-బి) పోస్టులకు 34 ఏళ్లు మించి ఉండకూడదు. 

దరఖాస్తు ఫీజు: గ్రూపు-ఎ పోస్టులకు రూ.500; గ్రూపు-బి పోస్టులకు రూ.200; గ్రూపు-సి పోస్టులకు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 04-11-2024.

Website:https://iitgoa.ac.in/