భారత సుదీర్ఘ పరుగు వీరుడు గుల్వీర్ సింగ్ 3000 మీటర్ల పరుగులో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
2025, ఆగస్టు 13న బుడాపెస్ట్‌లో జరిగిన హంగేరియన్ అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రిలో అతడు 3 వేల మీటర్ల రేసును 7 నిమిషాల 34.49 సెకన్లలో పూర్తి చేసి అయిదో స్థానంలో నిలిచాడు.
కెన్యా అథ్లెట్ కిప్సాంగ్ మాథ్యూ (7:33.23 సె) విజేతగా నిలిచిన ఈ రేసులో.. హెరీరా (7:33.58-మెక్సికో), ఆస్కార్ చెలిమో (7:33.93) తర్వాతి రెండు స్థానాలు సాధించారు.
గుల్వీర్ గత రికార్డు 7 నిమిషాల 38.26 సెకన్లు. 2025, ఫిబ్రవరిలో జరిగిన బోస్టన్ యూనివర్శిటీ మీట్‌లో అతను ఆ టైమింగ్ నమోదు చేశాడు.