Published on Sep 30, 2024
Current Affairs
గుల్వీర్‌ సింగ్‌కు స్వర్ణం
గుల్వీర్‌ సింగ్‌కు స్వర్ణం

♦ జపాన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ కాంటినెంటల్‌ టూర్‌లో భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ జాతీయ రికార్డు సృష్టిస్తూ స్వర్ణం నెగ్గాడు.

♦ 2024, సెప్టెంబరు 28న జరిగిన 5 వేల మీటర్ల పరుగులో అతడు 13 నిమిషాల 11.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు.

♦ ఈ క్రమంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (13 నిమిషాల 18.92 సె)ను సవరించాడు.