ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ 16 ఏళ్ల జాతీయ రికార్డును తిరగరాశాడు.
2025, ఫిబ్రరి 15న బోస్టన్‌లో జరిగిన 3000 మీటర్ల ఇండోర్ రేసును 7 నిమిషాల 38.26 సెకన్లలో ముగించాడు.
ఈ విభాగంలో సురేందర్ సింగ్ (2008లో 7 నిమిషాల 49.47 సెకన్లు) పేరిట ఉన్న రికార్డును మెరుగుపరిచాడు.
కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన గుల్వీర్ రేసును రెండో స్థానంలో ముగించాడు.