Published on Nov 25, 2024
Current Affairs
గుల్వీర్‌కు స్వర్ణం
గుల్వీర్‌కు స్వర్ణం

భారత అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ హచియోజి లాంగ్‌ డిస్టెన్స్‌ మీట్‌లో స్వర్ణం నెగ్గాడు. 2024, నవంబరు 23న జపాన్‌లో జరిగిన 10 వేల మీటర్ల పరుగును గుల్వీర్‌ 27 నిమిషాల 14.88 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలోనే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (27 నిమిషాల 41.81 సెకన్లు)ను సవరించాడు. 

2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన గుల్వీర్, 10 వేల మీటర్లతో పాటు 5 వేల మీటర్లలోనూ జాతీయ రికార్డు కలిగి ఉన్నాడు. 

జపాన్‌ వేదికగానే అతడు 2024 సెప్టెంబరులో 5 వేల మీటర్లలో జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సె) సృష్టించాడు.