- ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధస్మారకాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2025, డిసెంబరు 7న ఆవిష్కరించారు. దీన్ని గల్వాన్ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన భారత వీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. లద్దాఖ్‌లోని ష్యోక్-దౌలత్‌బేగ్ ఓల్డీ మార్గంలో కేఎం-120 పోస్టు వద్ద దీన్ని నిర్మించారు.
- ప్రపంచంలో సైనిక మోహరింపులు జరిగే అత్యంత కఠినమైన ప్రాంతంగా దీనికి పేరుంది. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో దీన్ని ‘భారత్ రణ్‌భూమి దర్శన్’ కార్యక్రమం కింద నిర్మించారు.
- 2025, జనవరి 15న ఆర్మీ దినోత్సవం నాడు దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది.