Published on Nov 14, 2024
Current Affairs
‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక
‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక

శిలాజ ఇంధనాల వాడకం వల్ల వెలువడే ఉద్గారాలు 2024లో రికార్డు స్థాయికి చేరనున్నాయని ‘గ్లోబల్‌ కార్బన్‌ ప్రాజెక్ట్‌’ నివేదిక వెల్లడించింది.

భారత్‌ నుంచి 4.6%, చైనాలో నామమాత్రంగా 0.2% చొప్పున పెరుగుదల ఉంటుందని నివేదిక అంచనా వేసింది.

బాకులో జరుగుతున్న కాప్‌29 సదస్సులో 2024, నవంబరు 13న ఈ నివేదికను విడుదల చేశారు. 

అమెరికా, ఈయూల నుంచి ఉద్గారాలు తగ్గనున్నాయని, మిగిలిన దేశాల నుంచి మాత్రం 1.1% పెరగవచ్చని నివేదిక తెలిపింది.