Published on Oct 23, 2025
Current Affairs
గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ
గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ సూచీ

హెన్లే అండ్‌ పార్టనర్స్, ఆల్ఫాజియో సంయుక్తంగా ‘2025 గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రిస్క్‌ అండ్‌ రిజైౖలెన్స్‌ ఇండెక్స్‌’ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక-రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకుని, పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. పెట్టుబడిదార్లకు అత్యంత అనుకూల దేశాల్లో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. 

స్విట్జర్లాండ్‌ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్‌(2), నార్వే(3), సింగపూర్‌(4), స్వీడన్‌(5), లగ్జెంబర్గ్‌(6), ఫిన్లాండ్‌(7), గ్రీన్‌లాండ్‌(8), నెదర్లాండ్స్‌(9), జర్మనీ(10) ఉన్నాయి. దక్షిణ సూడాన్, లెబనాన్, హైతీ, సూడాన్, పాకిస్థాన్‌.. ఇవన్నీ చివరి స్థానాల్లో నిలిచాయి.