Published on Oct 7, 2025
Current Affairs
గ్రేస్‌కు బ్రిటన్‌ పౌర పురస్కారం
గ్రేస్‌కు బ్రిటన్‌ పౌర పురస్కారం

భారత సంతతి యువతి గ్రేస్‌ ఓమైలీ కుమార్‌ (19)కి మరణానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం ద్వితీయ అత్యున్నత పౌర పురస్కారం జార్జ్‌ మెడల్‌ను ప్రకటించింది.

రెండేళ్ల క్రితం నాటింగ్‌హాంలో స్నేహితురాలిని కాపాడే ప్రయత్నంలో కత్తిపోట్లకు గురై ఆమె ప్రాణాలు కోల్పోయారు.

2023 జూన్‌ 13న గ్రేస్‌ తన స్నేహితురాలు బానబీ వెబర్‌తో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దాడి జరిగింది.

వాల్డో కైలోకేన్‌ అనే వ్యక్తి వెబర్‌పై వెనకనుంచి కత్తితో దాడిచేయగా, గ్రేస్‌ ధైర్య సాహసాలతో అతణ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.

దాడిలో స్నేహితులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.