67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్‌కు గ్రామీ అవార్డు దక్కింది.
ఆమె రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ ఛాంట్ అల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది.
గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. 2025, ఫిబ్రవరి 3న లాస్ ఏంజెలీస్ వేదికగా ఈ వేడుక జరిగింది.
2024, ఆగస్టు 30న ఆమె ‘త్రివేణి’ ఆల్బమ్‌ను విడుదల చేశారు. ఇందులో దక్షిణాఫ్రికా ప్లూటిస్ట్ వాటర్ కెల్లర్‌మాన్, జపనీస్ సెల్లిస్ట్ ఎరుమాట్సుమోటోతో కలిసి చంద్రికా టాండన్ వేద మంత్రాలను పఠించారు.
ఇందులో మూడు విభిన్న శైలిలో ఆలపించడంతో మూడు నదుల సంగమాన్ని సూచించే ‘త్రివేణి’ పేరును ఆల్చమ్‌కు పెట్టారు.
2009వ ఏడాది ఆమె తొలిసారిగా విడుదల చేసిన ‘సోల్ కాల్’ మ్యూజిక్ ఆల్బమ్ 2011లో గ్రామీ అవార్డుకు నామినేషన్‌ను అందుకుంది.
చంద్రికా కృష్ణమూర్తి చెన్నైలోని సంప్రదాయ మధ్యతరగతికి చెందిన తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కలిగిన పెప్సికో సంస్థ మాజీ సీఈవో ఇంద్రా నూయీకి ఆమె అక్క.