విఖ్యాత సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76 ఏళ్లు) 2025, మార్చి 9న తిరుపతిలో మరణించారు.
ఆయన వెయ్యికి పైగా అన్నమయ్య కీర్తనలు స్వరపరిచి, ఆలపించించారు. గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ 1948 నవంబరు 9న రాజమహేంద్రవరంలో జన్మించారు.
భారత శాస్త్రీయ, ఆధ్యాత్మిక గాయకులైన గరిమెళ్ల.. తితిదేకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టులో 1978లో గాత్ర కళాకారుడిగా ప్రవేశించి ఆస్థాన విద్వాంసుని హోదాకు ఎదిగారు.
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆయన గురువు.