ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)-4 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది.
మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. పీఎంజీఎస్‌వై-4 కింద దేశవ్యాప్తంగా రూ.70,125 కోట్లతో 62,500 కిలో మీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అంచనా విలువలో కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు సమకూర్చనున్నాయి.