ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుర్‌ప్రీత్ సింగ్ రజతం సొంతం చేసుకున్నాడు. 2025, నవంబరు 17న కైరోలో జరిగిన 25 మీటర్ల ఫైర్ పిస్టల్‌లో 584 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కొరోత్సెలోవ్ (ఉక్రెయిన్) 594 పాయింట్లతో స్వర్ణం నెగ్గాడు. యాన్ లూయిస్ (ఫ్రాన్స్, 583) కాంస్యం సొంతం చేసుకున్నాడు.