Published on Nov 16, 2024
Current Affairs
గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో షాంగై అగ్రస్థానం
గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల్లో షాంగై అగ్రస్థానం

ప్రపంచంలో అత్యధికంగా గ్రీన్‌హౌస్‌ వాయువులను వెదజల్లుతున్న నగరాల్లో షాంగై ముందుందని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘క్లైమేట్‌ ట్రేస్‌’ సంస్థ వెల్లడించింది. షాంగై దాదాపు 256 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల గ్రీన్‌హౌస్‌ వాయువులను వాతావరణంలోకి వదులుతోందని పేర్కొంది.

తర్వాతి స్థానాల్లో టోక్యో (250 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు), న్యూయార్క్‌ (160 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు), హ్యూస్టన్‌ (150 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు) నగరాలు ఉన్నాయి.   

అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న ‘కాప్‌ 29’ సదస్సులో 2024. నవంబరు 15న  ‘క్లైమేట్‌ ట్రేస్‌’ ఈ వ్యాఖ్యలు చేసింది.