వ్యవసాయ రంగ గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో 61 శాతానికి కారణమవుతున్న ఆరు దేశాల్లో భారత్ కూడా ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ జాబితాలో చైనా, ఇండోనేసియా, అమెరికా, థాయ్‌లాండ్, బ్రెజిల్ కూడా ఉన్నాయి. అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు పంటలు, మూలాలపరంగా వ్యవసాయ ఉద్గారాల వివరాలను ఒక కచ్చితమైన, సవివర మ్యాప్ రూపంలో అందించారు.
ఆహారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వరి పంట వాటా 43 శాతంగా ఉంది.