Published on Mar 29, 2025
Current Affairs
గురిందర్‌వీర్‌ జాతీయ రికార్డు
గురిందర్‌వీర్‌ జాతీయ రికార్డు

పురుషుల 100 మీటర్ల పరుగులో గురిందర్‌వీర్‌ సింగ్‌ జాతీయ రికార్డు సృష్టించాడు.

2025, మార్చి 28న బెంగళూరులో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ప్రి-1 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఈ పంజాబ్‌ స్ప్రింటర్‌ 10.20 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ క్రమంలో 2023లో మణికంఠ హోబ్లిధార్‌ (10.23 సె) సృష్టించిన రికార్డును అధిగమించాడు.

2021లో కెరీర్‌లో ఉత్తమంగా 10.27 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసిన గురిందర్‌.. ఇండియన్‌ గ్రాండ్‌ప్రిలో అంతకుమించిన ప్రదర్శన చేసి జాతీయ రికార్డును సొంతం చేసుకున్నాడు. 

మణికంఠ (10.22 సెకన్లు) రెండో స్థానంతో ఉండగా, అమ్లాన్‌ బోర్గొహైన్‌ (10.43 సె) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.