భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రి టైటిల్‌ను గెలుచుకుంది. 2025, ఏప్రిల్ 23న జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో సలిమోవా (బల్గేరియా)పై గెలిచి ఆమె ఏడు పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. పోలినా (రష్యా)ను ఓడించిన జు జినర్ (చైనా) కూడా ఏడు పాయింట్లతో నిలిచింది. కానీ మెరుగైన టైబ్రేక్స్ స్కోరు ఆధారంగా హంపి విజేతగా నిలిచింది. కష్లిన్‌స్కయా (పోలెండ్)తో గేమ్‌ను డ్రాగా ముగించిన దివ్య దేశ్‌ముఖ్ (5.5) మూడో స్థానం సాధించింది. బత్‌కుయాగ్ (మంగోలియా)తో గేమ్‌ను హారిక (4.5), సలోమ్ మెలియా (జార్జియా)తో గేమ్‌ను వైశాలి (4) డ్రాగా ముగించారు.