Published on May 20, 2025
Apprenticeship
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్) పోస్టులు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్) పోస్టులు

పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ సంస్థ హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), 2025-26 సంవత్సరానికి ఇంజినీరింగ్ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ (ఇంజినీరింగ్‌)

అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 1 సంవత్సరం

అర్హత: అభ్యర్థులు కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ50%) మార్కులతో సంబంధిత విభాగాలలో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 30-05-2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. (సడలింపు: SC/STలకు 5; OBC-NCలకు 3; PwBDలకు 10 సంవత్సరాలు).

జీతం/స్టైపెండ్: నెలకు రూ.25,000.

ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు (BOAT) ద్వారా ఎన్‌ఏటీఎస్‌ (NATS 2.0) పోర్టల్‌లో, హెచ్‌పీసీఎల్‌ అప్రెంటిస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30.05.2025.

Website:https://hindustanpetroleum.com/job-openings

Apply online:https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp