ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించటమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మహా హరిత కుడ్యం)’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్ ఏర్పాటు చేయనుంది. దీన్ని తీరానికి బయోషీల్డ్‌గా (జీవ రక్షణ కవచం) తీర్చిదిద్దినుంది. మొత్తం మూడు జోన్లతో గ్రేట్ గ్రీన్ వాల్‌ను ఏర్పాటు చేయనుంది.
ముఖ్యాంశాలు:
ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ముప్పును అధికంగా ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.
రాష్ట్రంలో తీరప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు: 33 లక్షల మంది
కోతకు గురవుతున్న తీరప్రాంతం: 32% మేర