కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ‘‘ఆది వాణి’’ పేరుతో కృత్రిమ మేధ సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్‌ను ప్రారంభించనుంది.
దేశంలోని భాషా వైవిధ్యాన్ని సంరక్షించి గిరిజన జాతులకు సాధికారికత కల్పించడం కోసం ఈ చర్య తీసుకున్నట్టు గిరిజన వ్యవహారాల శాఖ వెల్లడించింది.
వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటీ దిల్లీ, బిట్స్ పిలానీ, ఐఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీ నవ రాయ్‌పుర్ సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి.
ప్రారంభంలో ఇది సంతాలీ (ఒడిశా), భిలీ (మధ్యపదేశ్), ముండారి (ఝార్ఖండ్), గోండీ (ఛత్తీస్‌గడ్) భాషల్లో అనువాదానికి ఉపయోగపడుతుంది.
కోయ, గారో భాషల్ని తదుపరి దశలో యాప్‌నకు జతచేస్తారు.