Published on Aug 30, 2024
Current Affairs
గురుగ్రామ్‌లో సౌతాంప్టన్‌ వర్సిటీ క్యాంపస్‌
గురుగ్రామ్‌లో సౌతాంప్టన్‌ వర్సిటీ క్యాంపస్‌

జాతీయ విద్యా విధానంలో (ఎన్‌ఈపీ) భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ ఏర్పాటు కాబోతోంది. గురుగ్రామ్‌లో బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్‌ వర్సిటీ తన ఆఫ్‌లైన్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌ 2024, ఆగస్టు 29న దిల్లీలో వర్సిటీ ప్రతినిధులకు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను అందజేశారు. 

* సౌతాంప్టన్‌ భారత్‌ క్యాంపస్‌లో జులై 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.