గెయిల్ తదుపరి సీఎండీగా దీపక్ గుప్తా నియమితులుకానున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నియామక బోర్డు (పీఈఎస్‌బీ) ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పదవి కోసం మొత్తం 12 మంది పోటీపడగా, ప్రస్తుతం అదే సంస్థలో ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న దీపక్ పేరును పీఈఎస్‌బీ ఖరారు చేసింది. ప్రస్తుతం గెయిల్ సీఎండీగా ఉన్న సందీప్ కుమార్ గుప్తా 2026 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేసిన అనంతరం ఆ స్థానంలో ఈయన బాధ్యతలు చేపడతారు.