Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
న్యూదిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో ఈ5 గ్రేడ్ కేడర్‌లో చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14
వివరాలు:
1. చీఫ్ మేనేజర్ (రెన్యూవబుల్ ఎనర్జీ): 04 పోస్టులు
2. చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్): 04 పోస్టులు
3. చీఫ్ మేనేజర్ (లా): 01 పోస్టు
4. చీఫ్ మేనేజర్ (మెడికల్ సర్వీసెస్): 02 పోస్టులు
5. చీఫ్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్): 03 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, ఎండీ/ డీఎన్‌బీ/, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు రూ.90,000 - రూ.2,40,000.
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 11.12.2024.
Website:https://gailonline.com/CRApplyingGail.html
Apply online:https://gailebank.gail.co.in/recruitmentSystem/user/er_login.aspx