Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
న్యూదిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్‌లలో కింది విభాగాల్లో ఈ1, ఈ2 గ్రేడ్ కేడర్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 261 (యూఆర్- 126; ఈడబ్ల్యూఎస్- 22, ఓబీసీ (ఎన్‌సీఎల్)- 54; ఎస్సీ- 43; ఎస్టీ- 16)
వివరాలు:
1. సీనియర్ ఇంజినీర్ (రెన్యూవబుల్ ఎనర్జీ): 06 పోస్టులు
2. సీనియర్ ఇంజినీర్ (బాయిలర్ ఆపరేషన్స్): 03 పోస్టులు
3. సీనియర్ ఇంజినీర్ (మెకానికల్): 30 పోస్టులు
4. సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 06 పోస్టులు
5. సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 01 పోస్టు
6. సీనియర్ ఇంజనీర్ (కెమికల్): 36 పోస్టులు
7. సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్- టీసీ/టీఎం): 05 పోస్టులు
8. సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్ సేఫ్టీ): 20 పోస్టులు
9. సీనియర్ ఆఫీసర్ (సి&పి): 22 పోస్టులు
10. సీనియర్ ఇంజినీర్ (సివిల్): 11 పోస్టులు
11. సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్): 22 పోస్టులు
12. సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): 36 పోస్టులు
13. సీనియర్ ఆఫీసర్ (హ్యూమన్ రిసోర్స్): 23 పోస్టులు
14. సీనియర్ ఆఫీసర్ (లా): 02 పోస్టులు
15. సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్): 01 పోస్టు
16. సీనియర్ ఆఫీసర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్): 04 పోస్టులు
17. ఆఫీసర్ (ల్యాబొరేటరీ): 16 పోస్టులు
18. ఆఫీసర్ (సెక్యూరిటీ): 04 పోస్టులు
19. ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్): 13 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సీఏ, సీఎంఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: సీనియర్ ఆఫీసర్ (మెడికల్ సర్వీసెస్)/ ఆఫీసర్ (ల్యాబొరేటరీ) పోస్టులకు 32 ఏళ్లు. ఆఫీసర్ (సెక్యూరిటీ) పోస్టులకు 45 ఏళ్లు. ఆఫీసర్ (అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులకు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: నెలకు సీనియర్ ఇంజినీర్/ సీనియర్ ఆఫీసర్ పోస్టులకు రూ.60,000- రూ.1,80,000; ఆఫీసర్ పోస్టులలకు రూ.50,000- రూ.1,60,000 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 11.12.2024.
Website:https://gailonline.com/CRApplyingGail.html
Apply online:https://gailebank.gail.co.in/recruitmentSystem/user/er_login.aspx