అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ 2025, ఏప్రిల్ 1న దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేశాయి.