పశ్చిమ ఆఫ్రికాలోని గినీ బిసావులో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం.. దేశ ప్రధానిగా ప్రస్తుత ఆర్థిక మంత్రి ఇలిడో వియెరాను నియమించింది. ఈ మేరకు కొత్త సైనికాధిపతి జనరల్ హోర్టా ఎన్టా 2025, నవంబరు 28న ఆదేశాలు జారీ చేశారు. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు ఉమరో సిసాక ఎంబాలో స్థానంలో ఈయన నియమితులయ్యారు.
నవంబరు 23న గినీ బిసావో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. తర్వాత సైన్యం తిరుగుబాటు చేసింది. దీంతో అధ్యక్షుడు ఎంబాలో దేశం విడిచి పారిపోయారు.