ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు తయారుచేసిన రూ.5.13 కోట్ల విలువైన ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం వేదికగా ఒకేరోజు విక్రయించారు.
2025, మార్చి 8న ప్రకాశం జిల్లాలోని మార్కాపురం నుంచి ఈ విక్రయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బటన్ నొక్కి ప్రారంభించారు. ఓఎన్డీసీ వేదికగా వావ్‌జెని యాప్ సాయంతో ఇందుకు 2.08 లక్షల ఆర్డర్లు వచ్చాయి.
ఇది గిన్నిస్ రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం పలు సంస్థలతో రాష్ట్ర ఉన్నతాధికారులు మార్కాపురం వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. సెర్ప్, మెప్మా, ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
2024, ఆగస్టు 23న ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఇప్పుడు స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) తమ ఉత్పత్తులను ఒకే రోజున భారీ ఎత్తున విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.