ప్రభుత్వ రంగంలోని జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కేవలం 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,88,107 జీవిత బీమా పాలసీలను విక్రయించింది.
జనవరి 20న ఎల్‌ఐసీకి చెందిన 4,52,839 మంది ఏజెంట్లు కలిసి దీన్ని సాధించారు.
దీనికిగాను గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్‌ను సొంతం చేసుకుంది.
2025, జనవరి 20ని ‘మ్యాడ్ మిలియన్ డే’గా ప్రకటించి, ప్రతి ఏజెంట్ కనీసం ఒక పాలసీని విక్రయించాలని ఎల్‌ఐసీ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి పిలుపునిచ్చారు. దీనికి స్పందనే ఈ రికార్డు.