హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా 2025, జూన్ 14న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అవార్డులను ప్రదానం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌అశ్విన్‌లు పురస్కారాలు స్వీకరించారు. కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని యండమూరి వీరేంద్రనాథ్, పైడి జయరాజ్ అవార్డును మణిరత్నం, బీఎన్‌రెడ్డి పురస్కారాన్ని సుకుమార్, నాగిరెడ్డి-చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు అందుకున్నారు.
విజేతల వివరాలు:
ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ
ఉత్తమ ద్వితీయ చిత్రం: పొట్టేల్
ఉత్తమ తృతీయ చిత్రం: లక్కీ భాస్కర్
జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం: కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ బాలల చిత్రం: 35 - చిన్న కథ కాదు
ఉత్తమ చారిత్రక చిత్రం: రజాకార్
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: యదువంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి: నివేదా థామస్ (35 - చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్.జె.సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవ కోన: నిజమే నే చెబుతున్నా..)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప2: సూసేకి అగ్గిరవ్వలా..)
ఉత్తమ హాస్య నటుడు: సత్య, వెన్నెల కిశోర్ (సంయుక్తంగా) (మత్తు వదలరా 2)
ఉత్తమ బాల నటులు: మాస్టర్ అరుణ్‌దేవ్ పోతుల, బేబి హారిక (35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (రాజుయాదవ్: లేదే లేదే ప్రేమసలే..)
ఉత్తమ ఛాయాగ్రాహకుడు: విశ్వనాథ్‌రెడ్డి (గామి)
ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్ (గామి)
ఉత్తమ నృత్య దర్శకుడు: గణేశ్ ఆచార్య (దేవర: ఆయుధపూజ)
ఉత్తమ కళాదర్శకుడు: నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కె.చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనారావు, అజయ్‌కుమార్ (కల్కి 2898 ఏడీ)
స్పెషల్ జ్యూరీ పురస్కారాలు:
దుల్కర్ సల్మాన్, కథానాయకుడు (లక్కీ భాస్కర్)
అనన్య నాగళ్ల, కథానాయిక (పొట్టేల్)
సుజీత్, సందీప్, దర్శకులు (క)
ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి, నిర్మాతలు (రాజు యాదవ్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్:
ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2 - ర్యాప్ గీతం)
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం: మన సినిమా ఫస్ట్ రీల్ (రచయిత: రెంటాల జయదేవ)