తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని 2025, మే 29న హైదరాబాద్‌లో ప్రకటించారు.
2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఎంపికైంది.
‘పుష్ప 2’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి పురస్కారం దక్కింది.
‘35 - చిన్న కథ కాదు’లో నటనకుగానూ ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు.
కల్కి 2898 ఏడీ, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి.
చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న ‘రజాకార్’ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కగా.. చిన్న చిత్రాల్లో ‘35 - చిన్న కథ కాదు’, ‘కమిటీ కుర్రోళ్లు’ పలు విభాగాల్లో మెరిశాయి.
ప్రముఖ నటి జయసుధ ఛైర్‌పర్సన్‌గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతోపాటు.. వెయ్యికిపైగా నామినేషన్లను పరిశీలించి ఈ పురస్కారాల్ని ఎంపిక చేసింది.
జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు.