అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారత మూలాలున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ 2025 ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా 2025, జులై 22న తెలిపారు. పదవి నుంచి వైదొలగిన తర్వాత సెప్టెంబరు 1న ఆమె తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరనున్నారు.