గుజరాత్, వడోదరలోని గతిశక్తి విశ్వవిద్యాలయాలో 2025-26 విద్యాసంవత్సరానికి కింది ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
విభాగాలు:
1. టెక్నాలజీ
2. మేనేజ్‌మెంట్
ప్రోగ్రామ్‌లు:
అండర్ గ్రాడ్యుయేట్ (రెగ్యులర్ ప్రోగ్రామ్స్): బీటెక్ (సివిల్/ ఎలక్ట్రిక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డెటా సైన్స్/ ఏవియేషన్ ఇంజినీరింగ్.
పోస్టు గ్రాడ్యుయేట్ (రెగ్యులర్ ప్రోగ్రామ్): ఎంబీఏ (లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్/ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ లాజిస్టిక్స్/ మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్టెషన్/మెట్రో రైల్ మేనేజ్‌మెంట్).
పోస్టు గ్రాడ్యుయేట్ (ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్): ఎంటెక్ (ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్/ రైల్వే ఇంజినీరింగ్, బ్రిడ్జ్ అండ్ టన్నెల్ ఇంజినీరింగ్, లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్.
పోస్టు గ్రాడ్యుయేట్ (ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్): ఎంబీఏ (మల్టీ్-మోడల్ ట్రాన్స్‌పోర్టెషన్, మెట్రో రైల్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్).
పీహెచ్‌డీ: ఇంజినీరింగ్/ మేనేజ్‌మెంట్
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్, బీఈ, పీజీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ, సీయూఈటీ-పీజీ/క్యాట్/ మ్యాట్/ గ్జాట్/ గేట్ ప్రవేశ పరీక్షల స్కోరు ఉండాలి.
ఎంపిక విధానం: ప్రోగామ్‌ను అనుసరించి జేఈఈ మెయిన్ స్కోర్, జీఎస్‌ఏ ఎంట్రన్ష్ టెస్ట్, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల స్కోర్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 1.5.2025
Website:https://gsv.ac.in/