Published on Mar 22, 2025
Government Jobs
గతిశక్తి విద్యాలయంలో ప్రొఫెసర్‌ పోస్టులు
గతిశక్తి విద్యాలయంలో ప్రొఫెసర్‌ పోస్టులు

గుజరాత్‌లోని గతిశక్తి విద్యాలయం (జీఎస్‌వీ) వివిధ విభాగాల్లో కింది ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

1. ప్రొఫెసర్‌: 05

2. అసోసియేట్ ప్రొఫెసర్‌: 09

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 07

విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌, కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఏవియేషన్‌ ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: సెమినార్‌ అండ్ ఇంటరాక్షన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025

Website:https://gsv.ac.in/careers/invitation-of-applications-to-faculty-positions-2/

Apply online:https://gsvrec.samarth.edu.in/index.php