గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, కళా వైభవాన్ని చాటిన ఏటికొప్పాక పర్యావరణ అనుకూల శకటానికి మూడో బహుమతి లభించింది.
తొలి రెండు బహుమతులకు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మహాకుంభమేళా శకటం, త్రిపురకు చెందిన 14 దేవతామూర్తుల ఆరాధన శకటాలకు లభించాయి.
ముగ్గురు సభ్యులతో కూడిన జడ్జీల ప్యానల్ వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాల రూపకల్పన, వాటి ఇతివృత్తాలను పరిశీలించి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర రక్షణశాఖ అవార్డులను ప్రకటించింది.