Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 27, 2026
Current Affairs
గణతంత్ర వేడుకలు
గణతంత్ర వేడుకలు
  • 77వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 2026, జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్, యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాదాపు 10,000 మంది రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే పరేడ్‌ థీమ్‌గా 150 ఏళ్ల వందేమాతరాన్ని ఎంచుకున్నారు. కర్నల్‌ ఫ్రెడ్రిక్‌ సైమన్‌ స్ప్రూజ్‌ నేతృత్వంలోని ఈయూ సైనిక దళం వేడుకలకు హాజరైంది.
  • రిపబ్లిక్‌ డే వేడుకల పరేడ్‌కు కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ భవనీశ్‌ కుమార్‌ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో తొలిసారిగా కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్‌ లైట్‌ కమాండో బెటాలియన్‌ కవాతు నిర్వహించింది. దీంతోపాటు శక్తిబన్‌ రెజిమెంట్‌ పాల్గొంది. రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థ సూర్యాస్త్రను సైన్యం ప్రదర్శించింది. ఇది సుదూర ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడంతోపాటు కీలక మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోగలదు. 
  • ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, దివ్యాస్త్ర బ్యాటరీ, ధ్రువ్‌ అత్యాధునిక హెలికాప్టర్, టీ-90 భీష్మ ట్యాంకు, నాగ్‌ క్షిపణి వ్యవస్థ, రోబోటిక్‌ శునకాలు, డ్రైవరు రహిత వాహనాలు పరేడ్‌లో పాల్గొన్నాయి.
  • రెండు మూపురాలున్న ఒంటెలు, ఝన్‌స్కార్‌ పోనీలు తొలిసారిగా పరేడ్‌లో పాల్గొన్నాయి.
  • 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 30 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి.