మన దేశ 76వ గణతంత్ర దినోత్సవాలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియంతో ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
అధ్యక్షుడి హోదాలో సుబియంతో భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటనలో భాగంగా జనవరి 25న ఆయన దిల్లీకి చేరుకుంటారని, 26న గణతంత్ర ఉత్సవాలకు హాజరవుతారని విదేశీ వ్యవహారాల శాఖ జనవరి 16న వెల్లడించింది.