గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన కవాతులు, ఊరేగించిన శకటాల్లో అత్యుత్తమమైన వాటికి కేంద్ర ప్రభుత్వం 2026, జనవరి 28న అవార్డులు ప్రకటించింది. మూడు సైనిక విభాగాల కవాతులో నేవీ దళం; రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన శకటాల్లో గణేశ్ నిమజ్జనం ఇతివృత్తంతో రూపొందించిన మహారాష్ట్ర శకటం ఉత్తమ బహుమతికి ఎంపికయ్యాయి.
మంత్రిత్వ శాఖలు, విభాగాల కేటగిరీలో 150 ఏళ్ల వందేమాతరం ఉద్యమాన్ని కళ్లకు కట్టిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శకటం విజేతగా నిలిచింది.