ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని 2026, జనవరి 22న లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. ఛైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్‌పై సంతకం చేశారు. ఐక్యరాజ్యసమితికి పోటీగా దీన్ని ట్రంప్ తెరపైకి తీసుకొస్తున్నారన్న వార్తల నేపథ్యంలో దావోస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత్ సహా పలు దేశాలు దూరంగా ఉన్నాయి.
పశ్చిమాసియాలో కీలక దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈలు హాజరయ్యాయి. ఈజిప్టు, తుర్కియే, అజర్‌బైజాన్, పాకిస్థాన్, మొరాకో, ఇండోనేసియా, పరాగ్వే, హంగేరి సహా మొత్తం 19 దేశాలు పాల్గొన్నాయి.