అత్యంత స్వల్పశ్రేణి గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీఎస్) భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ 2026, ఫిబ్రవరి 27న ప్రకటించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌లో ఈ పరీక్షలు జరిగాయి. వరుసగా మూడుసార్లు ఈ ప్రయోగాలను నిర్వహించారు. భిన్న వేగాలు, పరిధి, ఎత్తుల్లో లక్ష్యాలను నేలకూల్చడంలో క్షిపణి సత్తాను ఈ సందర్భంగా పరీక్షించారు.
ఈ ఆయుధ వ్యవస్థను సైనికులు భుజంపై తరలించుకెళ్లవచ్చు. దీన్ని హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది.