నౌకా విధ్వంసక క్షిపణిని (ఎన్‌ఏఎస్‌ఎం-ఎస్‌ఆర్) తొలిసారిగా గగన తలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో), భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపుర్ సమీకృత పరీక్ష కేంద్రం నుంచి దీన్ని నిర్వహించారు.
నౌకాదళానికి చెందిన సీ కింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించారు.
క్షిపణికి చెందిన మ్యాన్-ఇన్-లూప్ ఫీచర్‌ను ఈ ప్రయోగం నిరూపించిందని, గరిష్ఠ పరిధితో సీ స్కిమ్మింగ్ మోడ్‌లో చిన్న నౌక లక్ష్యాన్ని నేరుగా చేరుకుందని అధికారులు వివరించారు.
టెర్మినల్ గైడెన్స్ కోసం ఈ క్షిపణి దేశీయ ఇమేజింగ్ ఇన్‌ఫ్రా రెడ్‌ను ఉపయోగించుకుందని తెలిపారు.