Published on Oct 4, 2024
Current Affairs
ఖుషీకి కాంస్యం
ఖుషీకి కాంస్యం

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ఖుషి కాంస్యం నెగ్గింది. 2024, అక్టోబరు 3న లిమా (పెరూ)లో జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్‌లో ఖుషి (447.3) మూడో స్థానంలో నిలిచింది. 

* ఎనిమిది మంది బరిలో దిగిన ఫైనల్లో సినోవీ బర్గ్‌ (458.4 - నార్వే) స్వర్ణం, కరోలిన్‌ లుండ్‌ (458.3 - నార్వే) రజతం సాధించారు.