Published on May 2, 2025
Current Affairs
ఖేల్‌రత్న అందుకున్న సాత్విక్, చిరాగ్‌
ఖేల్‌రత్న అందుకున్న సాత్విక్, చిరాగ్‌

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు (2023)ను భారత స్టార్‌ డబుల్స్‌ ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి 2025, మే 1న అందుకున్నారు. దిల్లీలోని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌) కేంద్ర కార్యాలయంలో కేంద్ర క్రీడల మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయ వీరికి పురస్కారం ప్రదానం చేశారు. ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన సాత్విక్, చిరాగ్‌లు విదేశాల్లో టోర్నీలు ఉండటంతో రాష్ట్రపతి భవన్‌లో అవార్డులు అందుకోలేకపోయారు.