Published on Jan 1, 2026
Current Affairs
ఖాలిదా జియా కన్నుమూత
ఖాలిదా జియా కన్నుమూత
  • బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా సేవలందించిన బేగం ఖాలిదా జియా (80) 2025, డిసెంబరు 30న ఢాకాలో మరణించారు. ఆమె బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) అధ్యక్షురాలు కూడా. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆమె 1946 ఆగస్టు 15న అవిభాజ్య భారత్‌లోని దినాజ్‌పుర్‌ జిల్లాలో జన్మించారు. 1960లో ఖాలిదా.. సైనిక కెప్టెన్‌ జియావుర్‌ రహ్మాన్‌ను వివాహం చేసుకున్నారు.
  • బంగ్లాదేశ్‌కు జియావుర్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 మే 30న సైనిక తిరుగుబాటు సందర్భంగా అధ్యక్షుడు జియావుర్‌ హత్యకు గురయ్యారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1978లో తన భర్త స్థాపించిన బీఎన్‌పీకి ఆయన హత్యానంతరం 1984లో ఛైర్‌పర్సన్‌ అయ్యారు. అప్పటి నుంచి చనిపోయే వరకూ ఆ పదవిలో కొనసాగారు.