భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ అధిపతి, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) 2025, ఏప్రిల్ 25న బెంగళూరులో మరణించారు.
1940 అక్టోబరు 24న కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన కస్తూరి రంగన్ దాదాపు దశాబ్దం పాటు ఇస్రో ఛైర్మన్‌గా సేవలందించారు.
అంతరిక్షానికి సంబంధించి పలు విభాగాల్లో 250కి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో కస్తూరి రంగన్ ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు.
జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) 2020 ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు.
కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని అభివృద్ధి చేయడానికి 12 మందితో ఏర్పడిన స్టీరింగ్ కమిటీకి నాయకత్వం వహించారు.
1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు.