Published on Nov 28, 2024
Government Jobs
కృష్ణా జిల్లాలో మేనేజర్, బ్లాక్ కో-ఆర్డినేటర్ పోస్టులు
కృష్ణా జిల్లాలో మేనేజర్, బ్లాక్ కో-ఆర్డినేటర్ పోస్టులు

మచిలీపట్నంలోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన కృష్ణా జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్, శిశుగృహ, చిల్డ్రన్ హోమ్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14.

వివరాలు:

ఔట్‌రీచ్ వర్కర్, మేనేజర్/ కో-ఆర్డినేటర్, డాక్టర్, ఆయా, చౌకీదార్, కుక్, హెల్పర్, పీటీ ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్, ఎడ్యుకేటర్, పారామెడికల్ పర్సనల్, సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ కో-ఆర్డినేటర్.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ, సర్టిఫికేట్ కోర్సు, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఉమాశంకర్ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి. 

ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-12-2024.

Website:https://krishna.ap.gov.in/